విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె స్వీయ దర్శకత్వంలో సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘సరస్వతి’. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా అగ్ర హీరోయిన్ సమంత ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సరస్వతి పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుందని, ఎలాంటి పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యవంతురాలైన మహిళగా ఆమె కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. షూటింగ్ పూర్తయిందని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. జీవా, ప్రకాష్‌రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: పూజా శరత్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకత్వం: వరలక్ష్మి శరత్‌కుమార్.