Ashes Series : స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ కొట్టింది. పెర్త్, బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆసీస్ అడిలైడ్‌లోనూ పంజా విసిరింది. మిచెల్ స్టార్క్(3-62), నాథన్ లియాన్(3-77) విజృంభించడంతో చావోరేవో మ్యాచ్‌లో పర్యాటక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐదోరోజు జేమీ స్మిత్(60), విల్ జాక్స్ (47)లు పోరాడినా స్టార్క్ వీరిద్దరిన ఔట్ చేసి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అడిలైడ్‌లో 82 పరుగుల తేడాతో గెలుపొందిన కంగారూ టీమ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో పట్టేసింది.
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పోరాడలేక ట్రోఫీ సమర్పిచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు ప్రధాన బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోవడంతో 82 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓవర్‌నైట్ స్కోర్ 2076 తో ఐదో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌ను మిచెల్ స్టార్క్(3-62) దెబ్బకొట్టాడు. అర్ధ శతకంతో రాణించిన జేమీ స్మిత్(60)ను, విల్ జాక్స్(47)ను ఔట్ చేసి పర్యాటక జట్టును ఓటమి ఖాయం చేశాడు. దాంతో, తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ఇవ్వలేకపోయిన ఇంగ్లిష్ టీమ్.. అడిలైడ్‌లోనూ అదే తడబాటుతో సిరీస్ సమర్పించుకుంది.
𝘼𝙨𝙝𝙚𝙨 𝙧𝙚𝙩𝙖𝙞𝙣𝙚𝙙 🎉
Sights from Australia’s clinical win in Adelaide 🙌
More 👉 https://t.co/Zwi3UpkPtp pic.twitter.com/zoFgTM49pc
— ICC (@ICC) December 21, 2025
ఆసీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఓపెనర్ జాక్ క్రాలే(85) అర్ధ శతకంతో ఆశలు రేపినా.. కమిన్స్ (3-24), నాథన్ లియాన్(3-64) వికెట్ల వేటకు టాపార్డర్ కుప్పకూలింది. కమిన్స్ ఓవర్లో జో రూట్(39), లియన్ దెబ్బకు హ్యారీ బ్రూక్(30)లు తేలిపోయారు. స్వల్ప తేడాతో బ్రూక్‌ను, బెన్‌స్టోక్స్(5)ను బౌల్డ్ చేసిన లియాన్ ఇంగ్లండ్‌ను విజయావకాశాల్ని దెబ్బతీశాడు. అర్ధ శతకంతో పోరాడిన క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఓటమి అంచున నిలిపాడు లియాన్. ఆఖరి సెషన్లో వికెట్ కాపాడుకున్న జేమీ స్మిత్, విల్ జాక్స్ ఐదోరోజు పోరాడినా స్టార్క్ వీరిద్దరిని పెవిలియన్ పంపి ఇంగ్లండ్ యాషెస్ కలను భగ్నం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన అలెక్స్ క్యారీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Australia retain the Ashes after attaining an unassailable 3-0 series lead in Adelaide 👊#WTC27 | #AUSvENG 📝: https://t.co/tPZVCGZI7D pic.twitter.com/6MjOGOQFH2
— ICC (@ICC) December 21, 2025