సిడ్నీ: జాతీయ జట్టుకు ఆడటమే తొలి ప్రాధాన్యంగా భావించి గత ఎనిమిదేండ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ వచ్చే ఏడాది ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. చివరిసారిగా 2015లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన స్టార్క్ ఆ తర్వాత లీగ్‌కు దూరమయ్యాడు.
వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్ 17వ సీజన్ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని స్టార్క్ గురువారం వెల్లడించాడు. ‘ఎనిమిదేండ్ల తర్వాత ఐపీఎల్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నా. వేలంలో నా పేరు నమోదు చేసుకుంటా’ అని స్టార్క్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలోనే స్టార్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.