మాడ్రిడ్: ఫుట్‌బాల్ అభిమానులకు చేదువార్త! పోర్చుగల్ సాకర్ స్టార్ డీగో జోటా తనువు చాలించాడు. స్పెయిన్ నార్త్‌వెస్ట్ ప్రాంతమైన జమోరా ప్రావిన్స్‌లోని క్రెండిల్లా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 28 ఏండ్ల లివర్‌పూల్ ఫార్వర్డ్ జోటా దుర్మరణం పాలయ్యాడు.
ఈ ప్రమాదంలో జోటాతో పాటు అతని సోదరుడు అండ్రీ కూడా మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక వార్తాసంస్థలు ధృవీకరించాయి. లాంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.