లండన్: భారత్‌తో వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లండ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ బ్యాటర్ జోరూట్ చోటు దక్కించుకున్నాడు. ఆదివారం 15 మందితో ప్రకటించిన జట్టులో రూట్‌కు చాన్స్ ఇచ్చారు. దాదాపు ఏడాది తర్వాత రూట్ తిరిగి జట్టులోకి రానున్నాడు.
గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ఆల్రౌండర్ బెన్ స్టోక్స్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్టోక్స్ గాయపడ్డాడు. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. బట్లర్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.