హైదరాబాద్, ఆట ప్రతినిధి: డబ్ల్యూపీసీ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరంగల్ జిల్లాకు చెందిన శ్రీవాణిరెడ్డి సత్తాచాటింది. ఎస్‌బీడీ ఈవెంట్లో పసిడి పతకంతో మెరిసింది. దీనికి తోడు వ్యక్తిగత డెడ్‌లిఫ్ట్, బెంచ్‌ప్రెస్ విభాగాల్లో శ్రీవాణి వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. రష్యా, కజకిస్థాన్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నీలకు ఆమె ఎంపికైంది.