బెంగళూరు: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ ఒడిదొడుకుల పయనం కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 0-1తో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది.
ఆద్య ంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు తరఫున అసిఫ్(34ని) ఏకైక గోల్ చేశాడు. ఈ మ్యాచ్ కోసం శ్రీనిధి ఎఫ్‌సీ మూడు మార్పులు చేసినా లాభం లేకపోయింది. లీగ్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నది.