హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి బౌల్డర్హిల్స్ వేదికగా జరుగుతున్న అరో రియాల్టీ టీ9 గోల్ఫ్ చాంపియన్షిప్లో శ్రీనిధి దక్కన్ వారియర్స్, సమ్మర్స్ట్రోమ్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లాయి. హోరాహోరీగా సాగుతున్న టోర్నీలో పూల్-డీ నుంచి శ్రీనిధి(7.5), స్ట్రోమ్(6.5) అర్హత సాధించాయి.
మిగతా విభాగాల్లో టూటోరూట్(9), బంకర్ బస్టర్స్(7.5), ఫెయిర్వే ఫాల్కన్స్(8.5), కైన్ డైరీ(7.5), లావిస్టా క్రూసేడర్స్(7.5), సెమెట్రిక్స్(6) క్వార్టర్స్లోకి ప్రవేశించాయి. టీ గోల్ఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎన్ఆర్ఎన్ రెడ్డి, మధుసూదన్రావుతో కలిసి మూడో సీజన్ ట్రోఫీని ఆవిష్కరించారు.