హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్ చాంపియన్‌షిప్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌డీఎఫ్‌సీ 3-0తో టీఆర్ఏయూ ఫుట్‌బాల్ క్లబ్‌పై అద్భుత విజయం సాధించింది. శ్రీనిధి తరఫున రిల్వాన్ హసన్, కాస్టెండా, బ్రాండెన్ గోల్స్ చేశారు.