షార్జా స్టేడియంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగులున్న పోరులో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తడబడుతోంది. ఇంగ్లండ్ బౌలర్లు.. శ్రీలంకను తమ బౌలింగ్‌తో కట్టిపడేస్తుండటంతో 10 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి కేవలం 66 పరుగులను మాత్రమే శ్రీలంక సాధించింది.
టాస్ గెలిచిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లకు 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఇప్పటికే 4 వికెట్లను నష్టపోవడంతో పాటు.. బ్యాట్స్మెన్లు సరిగ్గా రాణించకపోవడంతో స్వల్ప స్కోర్‌ను నమోదు చేసుకుంటోంది.
శ్రీలంక ఆటగాళ్లలో నిస్సాంక ఒక బంతిలో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రన్ ఔట్ అయ్యాడు. పెరీరా 9 బంతుల్లో 7 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అసలంక.. 16 బంతుల్లో 21 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫెర్నాండో 14 బంతుల్లో 13 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రాజపక్స, శనక ఉన్నారు. రాజపక్స 13 బంతుల్లో 16 పరుగులు చేయగా.. శనక.. 7 బంతుల్లో 7 పరుగులు చేశాడు.
Avishka Fernando is trapped plumb in front of the stumps ☝️
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Jordan celebrates the wicket as Sri Lanka are four down. #T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo
Adil Rashid gets his second scalp 🙌
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Kusal Perera attempts to slog a googly but fails to get a proper connection.
He is gone for 7.#T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo
Sri Lanka lose their second wicket.
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Asalanka's enterprising knock of 21 comes to an end as Adil Rashid does the damage. #T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/MogPW4TqLn