టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. 15 ఓవర్లు దాటే సరికే స్కోర్ 140లో పడింది. ఓపెనర్ నిన్సాంక, అసలంక.. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి శ్రీలంకకు భారీ స్కోర్‌ను అందించారు. 41 బంతుల్లో 51 పరుగులు చేసిన నిస్సాంక.. బ్రావో బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అసలంక 35 బంతుల్లో 52 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ శనక కూడా క్రీజులో ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు 4 బంతుల్లో 9 పరుగులు చేశాడు. 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి శ్రీలంక 153 పరుగులు చేసింది.