NuwanThushara : ఐపీఎల్-19లో ఆడేందుకు అనుమతించని శ్రీలంక బోర్డును కోర్టుకు ఈడ్చిన పేసర్ నువాన్ తుషార (NuwanThushara) మనసు మార్చుకున్నాడు. తమ దేశ బోర్డుపై పెట్టని కేసును అతడు వాపస్ తీసుకున్నాడు. ఐపీఎల్ కోసం తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వనుందుకు కోర్టును ఆశ్రయించిన తుషార గురువారం కేసు వెనక్కి తీసుకునట్టు ప్రకటించాడు. కొలంబో జిల్లా కోర్టు అతడి అభ్యర్థనను స్వీకరించింది. దాంతో, గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన కేసు ముగిసినట్టైంది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో నువాన్ తుషార రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆడాల్సి ఉంది. మినీ వేలంలో రూ.1.60 కోట్లకు అతడిని కొన్న ఆర్సీబీ తమ బౌలింగ్ అస్త్రం అవుతాడని భావించింది. కానీ, అనూహ్యంగా.. ఈ స్పీడ్స్టర్కు సొంత బోర్డైన శ్రీలంక క్రికెట్ నుంచి అనుమతి లభించలేదు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఫిట్నెస్ టెస్టులో తుషార విఫలమయ్యాడు.
Cricketer Nuwan Thushara has withdrawn his petition filed before the Colombo District Court seeking an interim order compelling Sri Lanka Cricket to issue a no objection certificate (NOC) to enable his participation in the 2026 Indian Premier League and other international… pic.twitter.com/VCK0mlpTBl
— NewsWire 🇱🇰 (@NewsWireLK) April 23, 2026
ముఖ్యంగా 2 కిలోమీటర్ల పరుగులో ఈ పేసర్ తేలిపోయాడు. దాంతో, ఐపీఎల్ ఆడేందుకు అతడికి ఎన్ఓసీ లభించలేదు. తనకు ఎన్ఓసీ నిరాకరించిన బోర్డు సంగతి కోర్టులోనే తేల్చుకోవాలనుకున్నాడు తుషార. అందుకని కొలంబో జిల్లా కోర్టులో లంక బోర్డుపై కేసు వేశాడు. అయినా బోర్డు మాత్రం తాము నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలు అందుకున్నవాళ్లకే ఎన్ఓసీ ఇచ్చామని కోర్టుకు విన్నవించింది.
RCB pacer Nuwan Thushara has been denied an NOC by the SLC – he is eligible to take another fitness test, but only after a gap of four to five days, which means he will not be available for the team’s first few games at least 👉 https://t.co/R6OQ6tm5Rv pic.twitter.com/TlA3RdpT9s
— ESPNcricinfo (@ESPNcricinfo) March 27, 2026
అయితే.. ఐపీఎల్ మొదలై నెల దగ్గరపడినందున.. కోర్టు కేసుతో లాభం లేదని తుషార భావించాడు. ఈమధ్యే సొంత బోర్డును కోర్డుకు ఈడ్చి తప్పు చేశానని భావించిన తుషార క్షమాపణలు చెప్పాడు. గత విచారణ సమయంలో అతడు కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తన న్యాయ బృందం ద్వారా కోర్టుకు తెలియజేశాడు. కొలంబో జిల్లా కోర్టు తుషార బృందం విజ్ఞప్తిని సంతోషంగా స్వీకరించింది. దాంతో.. లంక బోర్డుకు పెద్ద ఊరట లభించింది.