INDW vs SLW : రెండో టీ20లోనూ శ్రీలంక ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ విష్మీ గుణరత్నే(1)ను క్రాంతి గౌడ్ (15-1 )వెనక్కి పంపింది. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగిన చమరి ఆటపట్టు(31) సిక్సర్‌గా యత్నించగా.. అమన్‌జోత్ కౌర్ చక్కగా క్యాచ్ పట్టడంతో తను వెనుదిరిగింది. ఆరంభంలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయిన లంక పవర్ ప్లేలో 39 రన్స్ చేసింది.
వైజాగ్‌లో భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. టాస్ ఓడిన శ్రీలంకకు తన మొదటి ఓవర్లోనే క్రాంతి గౌడ్ షాకిచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ విష్మీ గుణరత్నే(1)ను రిటర్న్ క్యాచ్‌తో ఆమె పెవిలియన్ చేర్చింది. అనంతరం ఓవర్‌కు ఫోర్, సిక్స్ చొప్పున దంచేసిన చమరి ఆటపట్టు (31) దూకుడుగా ఆడే క్రమంలోస్నేహ్ రానా ఓవర్లో ఔటయ్యింది.
Caught and bowled!
Early wicket for #TeamIndia and Kranti Gaud 🥳
Updates ▶️ https://t.co/Umn9ZGAexw#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/fkFxh2F2ZP
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
మిడాన్‌లో పెద్ద షాట్ ఆడిన తనను అమన్‌జోత్ కౌర్ అద్భుత క్యాచ్‌తో డగౌట్ చేర్చింది. ఫలితంగా లంక టీమ్ పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హాసిని పెరీరా(6), హర్షిత సమరవిక్రమ(1)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 39-2.