Swiss Open 2024 : ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. యువకెరటం ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawt) క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. కిరణ్ జార్జిలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో శ్రీకాంత్ తన రాకెట్ పవర్ చూపించాడు.
చైనీస్ తైపీకి చెందిన చియా హవో లీని వరుస సెట్లలో 21-10, 21-14తో చిత్తుగా ఓడించాడు.ఫైనల్ బెర్తు కోసం ఈ భారత స్టార్ ఆటగాడు చైనీస్ తైపీ షట్లర్ లిన్ చు యూతో తలపడనున్నాడు.
Congratulations @srikidambi for a clinical victory in the quarterfinals of the Yonex Swiss open today. Great going.@meaindia @PMOIndia @DrSJaishankar @AmbVMKwatra @AmbKapoor @IndiaSports @YASMinistry @BAI_Media @bwfmedia @BaselStadt #SwissOpen2024 #YonexSwissOpen2024 pic.twitter.com/pq2ztLgOki
— India in Switzerland & Liechtenstein (@IndiainSwiss) March 23, 2024
భారత వర్దమాన ఆటగాడు రజావత్ క్వార్టర్స్ దాటలేకపోయాడు. ఈ టోర్నీలో అద్భుత ఆటతో సెమీస్ చేరేలా కనిపించిన రజావత్.. చైనీస్ తైపీ ఆటగాడు చౌ థియెనె చెన్ ధాటికి చేతులెత్తేశాడు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 15-21, 19-21తో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు.