DC vs PBKS | ఆరంభంలోనే ఢిల్లీకి షాక్ తగిలింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.2 ఓవర్‌కు ఆర్ష్‌దీప్ వేసిన బాల్‌కు మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. ముందుగా పంజాబ్‌పై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ బౌండరీలు బాదారు. దీంతో మూడు ఓవర్లలోనే 33 పరుగులు చేశారు. ఐదు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి ఢిల్లీ 51 పరుగులు చేసింది.