హైదరాబాద్ : భారత్, శ్రీలంక(SL Vs Ind) వన్డే పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్ఇండియాకు అదనపు బలం కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా, ఇటీవల మరణించిన భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతికి సంతాప సూచకంగా భారత క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు.
తుది జట్లు ఇవే..
భారత్ : రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కల్ రాహుల్(w), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(c), జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అకిల ధనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్