SL Vs BAN Test | ఛటోగ్రామ్ : బంగ్లాదేశ్తో ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా శ్రీలంక భారీ స్కోరు సాధించింది. 314/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన లంకేయులు జోరు కొనసాగించారు.
కెప్టెన్ ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92), చండిమాల్(59)లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో లంక 531 పరుగుల భారీ స్కోరు చేసింది.అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బంగ్లా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.