కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను లంక 1-0తో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 115/6తో శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా..లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య(5/56) ధాటికి 133 పరుగులకు కుప్పకూలింది. లంక బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టారు. తన టెస్టు కెరీర్లో 12వ సారి ఐదు వికెట్లు తీసిన జయసూర్య..బంగ్లా పతనంలో కీలకమయ్యాడు. అంతకుముందు పతుమ్ నిస్సనక(158) సెంచరీకి తోడు దినేశ్ చండిమల్(93), కుశాల్ మెండిస్(84) రాణించడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నిస్సనకకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ దక్కింది.