మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 23, 2020 , 00:04:14

హ్యాట్సాఫ్‌ హసరంగ

హ్యాట్సాఫ్‌ హసరంగ
  • తొలి వన్డేలో విండీస్‌పై లంక విజయం

కొలంబో: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌పై శ్రీలం క పైచేయి సాధించింది. లెగ్‌ స్పిన్నర్‌ వణిండు హసరంగ (39 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) బ్యాట్‌తో మెరువడంతో మూ డు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లంక ఒక వికెట్‌ తేడాతో విండీస్‌పై నెగ్గింది. ఓపెనర్‌ షై హోప్‌ (115; 10 ఫోర్లు) సెంచరీతో మొదట వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో లంక 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 రన్స్‌ చేసింది. కరుణరత్నే (52) ఫెర్నాండో (50), కుషాల్‌ పెరేరా (42), తిషార పెరేరా (32) ఆకట్టుకున్నారు. తిషార ఔటయ్యాక లంకకు ఓటమి తప్పదని భావిస్తే.. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను కాచుకుంటూ  వణిండు హసరంగ చక్కటి షాట్లతో జట్టును గెలిపించాడు.


logo
>>>>>>