Sri Lanka Cricket: వన్డే వరల్డ్ కప్ వైఫల్యంతో పాటు ఇటీవలి కాలంలో అత్యంత పేలవ ప్రదర్శనతో ప్రభ కోల్పోయిన శ్రీలంక క్రికెట్ రూపురేఖలు మార్చేందుకు బోర్డు నడుంకట్టింది. ఈ మేరకు మూడు ఫార్మాట్లకూ ముగ్గురు సారథులను నియమించింది. ఇదివరకే పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ఉన్న దసున్ శనకను తప్పించి వన్డేల బాధ్యతలు కుశాల్ మెండిస్‌కు టీ20 పగ్గాలు వనిందు హసరంగకు అప్పగించిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తాజాగా టెస్ట్ కెప్టెన్‌నూ మార్చింది. లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వను రెడ్ బాల్ కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
టెస్టులలో లంకకు నాలుగేండ్లుగా దిముత్ కరుణరత్నె సారథిగా వ్యవహరిస్తున్నాడు. 2018-19 నుంచి ఇప్పటిదాకా అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. లంకను 30 టెస్టులలో (12 విజయాలు, 12 ఓటములు, ఆరు డ్రాలు) నడిపించిన కరుణరత్నె.. ఇక నుంచి బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడు. కరుణరత్నె వారసుడిగా ఎంపికైన ధనంజయ లంకకు 18వ టెస్టు కెప్టెన్.
Sri Lanka New Captains for All 3 formats!🇱🇰🏏
▪️Test Captain – Dhananjaya De Silva
▪️ODI Captain – Kusal Mendis
▪️T20I Captain – Wanindu Hasaranga#SriLankaCricket #Test #ODI #T20I #T20Cricket #DhananjayaDeSilva #KusalMendis #WaninduHasaranga #cricketinsomnia pic.twitter.com/AJEwxWyS1K— Cricket insomnia (@CricketInsomnia) January 3, 2024
ఇప్పటివరకూ లంక తరఫున 51 టెస్టులు ఆడిన డిసిల్వ.. 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు, 34 అర్థ సెంచరీలున్నాయి. డిసిల్వ తన తొలి సవాల్ వచ్చే నెలలో ఎదురుకాబోతుంది. ఫిబ్రవరి 6 నుంచి ఆ జట్టు స్వదేశంలోనే అఫ్గానిస్తాన్‌తో టెస్టు ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులుంటాయి. మరి ముగ్గురు కొత్త సారథుల నేతృత్వంలో లంక ఏ మేరకు రాణిస్తుందో చూడాలి..