లక్నో: ప్రపంచకప్‌లో వరుసగా రెండు ఓటములతో సతమవుతున్న శ్రీలంక జట్టుకు పిడుగులాంటి వార్త. కెప్టెన్ దసున్ శనక తొడ కండరాల గాయంతో మెగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శనక కోలుకునేందుకు మూడు వారాల పైనే పట్టనుంది.
దాంతో, లంక మేనేజ్మెంట్ శనక స్థానంలో కరుణరత్నేను ప్రపంచ కప్ స్కాడ్లోకి తీసుకుంది. శనక గైర్హాజరీలో వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్ సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.