ఛటోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. ఛటోగ్రామ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో లంకేయులు.. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 192 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేశారు. చివరి రోజు విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచిన లంక.. గెలుపు కోసం 18 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది.
268/7 వద్ద ఐదో రోజు ఆట ఆరంభించిన బంగ్లా.. మరో 50 రన్స్ జోడించి 318 పరుగులకు ఆలౌట్ అయింది. మెహదీ హసన్ మిరాజ్ (81 నాటౌట్) పోరాడాడు. లంక బౌలర్ లాహిరు కుమారకు నాలుగు వికెట్లు దక్కాయి. తొలి టెస్టును లంక 328 పరుగుల తేడాతో నెగ్గిన విషయం విదితమే.