గాలె: భారత్-ఏ జట్టుతో రెండో అనధికార టెస్టును శ్రీలంక-ఏ సాధికారంగా ప్రారంభించింది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక తొలి రోజు చివరకు 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది. కెప్టెన్ సహాన్ అరాచిగే (83 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు.
నువానిడు ఫెర్నాండో (44), అంజల బండారా (42) సత్తా చాటగా.. ఓపెనర్లు పవంత వీరసింఘే (39), సోహన్ దిలివేర (28), అషేన్ బండారా (34) ఫర్వాలేనిపించారు. సహాన్‌తో పాటు చమిక గుణశేఖర (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.