IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. టేబుల్ 4లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. ఉప్పల్ స్టేడియలో గుజరాత్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కమిన్స్ వెల్లడించాడు. గుజరాత్ మాత్రం ఒక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ధాటికి ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్న కరీమ్ జనత్‌ను పక్కన పెట్టింది. దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీని తుది జట్టులోకి తీసుకుంది. రికార్డులు చూస్తే గిల్ సేనదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరుజట్లు 5 సార్లు తలపడగా.. గుజరాత్ 4 విజయాలతో ఆధిక్యంలో ఉంది.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, గెరాల్డ్ కొయెట్జీ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంప్యాక్ట్ సబ్స్ : ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to field against @gujarat_titans
Updates ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH pic.twitter.com/IEMnrgyUTA
— IndianPremierLeague (@IPL) May 2, 2025
హైదరాబాద్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీశ్ రెడ్డి, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, జీషన్ అన్సారీ, షమీ.
ఇంప్యాక్ట్ సబ్స్ : అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్.