IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక పోరుకు సిద్ధమైంది. 7 ఓటములతో 9వ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ బృందం భారీ స్కోర్‌తో ఆరెంజ్ ఆర్మీకి మరోసారి షాక్ ఇవ్వాలనుకుంటోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ ముగ్గురు పేసర్లు.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
ఈ గేమ్ కోసం ఉప్పల్ పిచ్, ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నటరాజన్‌ను ఆడిస్తోంది ఢిల్లీ. మెగా వేలంలో రూ.10 కోట్లు పలికిన నట్టూకు ఈ ఎడిషన్‌లో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం.
ఇక.. వరుసగా విఫలం అవుతున్న నితీశ్ కుమార్ రెడ్డిపై వేటు వేసిన హైదరాబాద్.. సచిన్ బేబీ, అభినవ్ మనోహర్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్) , సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ : ట్రావిస్ హెడ్, హర్ష్ దూబే, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్, షమీ.
🚨 Toss 🚨@SunRisers won the toss and chose to bowl first against @DelhiCapitals
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC pic.twitter.com/ni0fhqLSJg
— IndianPremierLeague (@IPL) May 5, 2025
ఢిల్లీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత్ చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్.
ఇంప్యాక్ట్ సబ్స్ : అశుతోష్ శర్మ, జేక్ ఫ్రేజర్, సమీర్ రిజ్వీ, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ.