హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (55)ను వెటరన్ పేసర్ భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. భువీ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు శాంసన్ ప్రయత్నించాడు. కానీ అతనికి రూమ్ లభించలేదు.
ఎలాగోలా ట్రై చేసి బంతిని బౌండరీ తరలించడానికి ప్రయత్నించాడు. గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు లాంగాన్ నుంచి పరిగెత్తుకొచ్చిన అబ్దుల్ సమద్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో శాంసన్ ఇన్నింగ్స్ ముగిసింది. 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 170/4 స్కోరు చేసింది.