Abhishek Sharma | పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు. తన ఐపీఎల్ కెరియర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. దాంతో క్రిస్ గేల్, ట్రావిస్ హెడ్ క్లబ్లో చేరాడు. ఇటీవల వరుసగా విఫలమవుతూ వచ్చిన అభిషేక్ పంజాబ్‌తో మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ తరఫున అభిషేక్, ట్రావిస్ హెడ్ ఇది రెండో భారీ భాగస్వామ్యం.
ఇంతకు ముందు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ మధ్య 185 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్లో వేగంగా ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, వేగంగా సెంచరీ చేసిన మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే ఈ ఐపీఎల్లో భారీ సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. పదో ఓవర్లో పంజాబ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపి రికార్డు సృష్టించాడు. పంజాబ్‌పై అభిషేక్ 141 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మన్ 256.36 స్ట్రయిక్ రేట్‌తో 14 ఫోర్లు, పది సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ మరో ఐదు బంతుల మిగిలి ఉండగానే.. రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ ఛేజ్ చేయడం గమనార్హం.