లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు తొలి వికెట్ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. రెండో ఓవర్లోనే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అతను రెండో ఓవర్ నాలుగో బంతికి ప్రమాదకరమైన క్వింటన్ డీకాక్‌ను పెవిలియన్ చేర్చాడు.
లెగ్‌స్టంప్ వైపు సుందర్ వేసిన బంతిని రూమ్ తీసుకొని డ్రైవ్ చేశాడు డీకాక్. షార్ట్ ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో డీకాక్ నిరాశగా వెనుతిరిగాడు. సన్‌రైజర్స్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.