ఈ ఐపీఎల్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్ మాథ్యూ వేడ్ (19) మరోసారి విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సింది పోయి.. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఇనిమిదో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యే సమయానికి గుజరాత్ స్కోరు 63 పరుగులే.
రన్ రేట్ బాగున్నప్పటికీ కీలక వికెట్లు పోవడంతో గుజరాత్ జట్టు కొంత ఇబ్బందిలో పడింది. అయితే క్రీజులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉండటం, అలాగే తర్వాత బ్యాటింగ్ లైనప్‌లో మిల్లర్, తెవాటియా వంటి హార్డ్ హిట్టర్లు ఉండటంతో గుజరాత్ భారీ స్కోరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.