IPL 2025 : భారీ ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు వీరబాదుడు బాదుతున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలిస్తున్నారు. సిక్సర్లతో రెచ్చిపోతున్న అభిషేక్ శర్మ(49) అర్ద శతకానికి చేరువయ్యాడు. స్టోయినిస్ వేసిన 6వ ఓవర్ ఆఖరి బంతిని ట్రావిస్ హెడ్(28) బౌండరీకి తరలించాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ వికెట్ కోల్పోకుండా పవర్ ప్లేలో 83 పరుగులు చేసింది.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్() రెండు బౌండరీలు బాదాడు. యాన్సెస్ బౌలింగ్‌లో బ్యాట్ ఝులిపించిన అభిషేక్ శర్మ(0) 4 ఫోర్లు సంధించి 16 రన్స్ పిండుకున్నాడు. అనంతరం అర్ష్‌దీప్‌కి చుక్కలు చూపిస్తూ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు హెడ్. దాంతో 3 ఓవర్లకే సన్‌రైజర్స్ స్కోర్ 40కి చేరింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన యశ్ ఠాకూర్ ఓవర్లో అభిషేక్ సిక్సర్ బాదగా స్కోర్ 50 దాటింది. కానీ, ఆ తర్వాత బంతికే బౌండరీ వద్ద శశాంక్ సింగ్ క్యాచ్ అందుకున్నా అది నో బాల్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ సంబురాలు చేసుకుంది.
What a whirlwind of a 4th over! 🌪️
Travis Head & Abhishek Sharma get #SRH off to a blazing start in the chase 👊
They are 60/0 after 4 overs.
Updates ▶️ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/ZuJ5a8eeob
— IndianPremierLeague (@IPL) April 12, 2025