IPL 2024 | ఆరెంజ్ ఆర్మీకి బిగ్ షాక్.. బౌలింగ్ కోచ్‌గా వైదొలిగిన స్టెయిన్..!
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొలగనున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళానికి దిశానిర్దేశం చేస్తున్న..
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొలగనున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళానికి దిశానిర్దేశం చేస్తున్న స్టెయిన్ తనకు బ్రేక్ కావాలని మేనేజ్మెంట్కు చెప్పేశాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ కొత్త బౌలింగ్ కోచ్ వేటలో పడింది.
స్టెయిన్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు? అనేది మాత్రం హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న డానియల్ వెటోరి(Daniel Vettori) ఎవరికి ఓటు వేస్తాడు? అని హైదరాబాద్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్రాన్ మాలిక్, స్టెయిన్

ఐపీఎల్లో స్టెయిన్ మొదట్లో దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. ఈ స్పీడ్‌స్టర్ 2022లో బౌలింగ్ కోచ్‌గా హైదరాబాద్ జట్టులో చేరాడు. జమ్ము కశ్వీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్(Umran Malik) నిఖార్సైన పేసర్‌గా రాటుదేలడంలో ఈ దక్షిణాఫ్రికా లెజెండ్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. గత సీజన్లో హైదరాబాద్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, మేనేజ్మెంట్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసింది.
స్టెయిన్, ప్యాట్ కమిన్స్

కోచ్ బ్రియాన్ లారాను తప్పించి.. డేనియల్ వెటోరీని కోచ్‌గా నియమించింది. అంతేకాదు ఈసారి కెప్టెన్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. మినీ వేలంలో భారీ ధర పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
- Sameer Wankhede | ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు చిన్నదే..! లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై సమీర్ వాంఖడే కీలక వ్యాఖ్యలు..!
- Priyanka Chopra | న్యూ హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా
- Paris Olympics 2024 | ఇటలీలో వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నీ.. ఒలింపిక్స్ బెర్తుపై భారత బాక్సర్ల గురి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

