IPL 2026 Auction : ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక క్రికెటర్ లియాం లివింగ్‌స్టోన్ (Liam Livingstone)ను పట్టేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను ఆరెంజ్ ఆర్మీ రెండో రౌండ్లో కొనేసింది. మ్యాచ్ విన్నరైన అతడిని రూ.13 కోట్లకు దక్కించుకుంది. పంతొమ్మిదో సీజన్ వేలంలో హెస్ఆర్హెచ్ అత్యధిక ధరకు కొన్న ప్లేయర్ లివింగ్‌స్టోనే. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా కుర్రాడు జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards) ఉన్నాడు. కావ్యా మారన్ టీమ్ ఈ యంగ్‌స్టర్‌ను రూ.3 కోట్లకు కొన్నది.
ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్ కోసం ఎదురుచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లివింగ్‌స్టోన్‌ను కొనేసంది. ఈ డేంజరస్ బ్యాటర్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడగా.. చివరకు రూ.13 కోట్లకు ఆరెంజ్ ఆర్మీ దక్కించుకుంది. అన్క్యాప్డ్ క్రికెటర్ శివం మావిని రూ.755 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా యువకెరటం జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది.
Orange Army, make way for Liam Livingstone!🧡
He is sold to @SunRisers for INR 13 Crore 💰👏#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/YMo7f9joGP
— IndianPremierLeague (@IPL) December 16, 2025
ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రూపంలో విధ్వంసక ఆటగాళ్లు ఉండగా.. ఇప్పుడు లివింగ్‌స్టోన్ రాకతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ యూనిట్ మరింత పటిష్టం కానుంది. అయితే.. గతంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున నిరాశపరిచిన ఇంగ్లండ్ స్టార్ ఈసారైనా భారీ ధరకు న్యాయం చేస్తాడా? లేదంటే ఉసూరుమనిపిస్తాడా? అనేది చూడాలి.