APL 2024 : ఐపీఎల్లో అదరగొడుతున్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumr Reddy) చరిత్ర సృష్టించాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్(Andhra Premier League)లో ఈ లోకల్ బాయ్ రికార్డు ధర పికాడు. మూడో సీజన్ వేలంలో నితీశ్ ఏకంగా రూ.15.6 లక్షలు కొల్లగొట్టాడు. ఐపీఎల్ పదిహేడో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) తరఫున ఇరగదీస్తున్ నితీశ్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు గోదావరి టైటాన్స్(Godavari Titans) ఫ్రాంచైజీ భారీ ధర పెట్టి అతడిని సొంతం చేసుకుంది.
దాంతో, ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నితీశ్ రికార్డు నెలకొల్పాడు. ఏపీఎల్‌లో కాస్ట్లీ ప్లేయర్‌గా నిలవడంతో ఈ యంగ్‌స్టర్ ఆనందం పట్టలేకపోయాడు. హోటల్ గదిలో సహచర ఆటగాళ్లతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్న వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
A post shared by APL-Andhra Premier League – Official Account (@andhrapremierleague)
ఈ ఏడాది రంజీ సీజన్లో నితీశ్ ఆంధ్ర తరఫున అద్బుతంగా రాణించాడు. దాంతో, అతడు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) స్థానాన్ని భర్తీ చేస్తాడనే వార్తలు వినిపించాయి. బ్యాటుతో, బంతితో సత్తా చాటుతున్న నితీశ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానుల దృష్టిలో పడ్డాడు.
View this post on Instagram
A post shared by APL-Andhra Premier League – Official Account (@andhrapremierleague)
ఇంకేముంది పదిహాడే సీజన్ వేలంలో కావ్యా మారన్(Kavya Maran) బృందం నితీశ్‌ను రూ. 20 లక్షలకు కొనేసింది. మయాంక్ అగర్వాల్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన నితీశ్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మిడిలార్డర్లో దంచేందుకు నేనున్నాంటూ నిరూపించుకన్న నితీశ్ 150 స్ట్రయిక్‌రేటుతో 239 రన్స్ కొట్టాడు. బంతితోనూ చెలరేగి 3 వికెట్లు పడగొట్టాడు.