ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఏడేళ్లపాటు క్రికెట్లో నిషేధం ఎదుర్కొన్ని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్.. తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తాను కేరళ తరఫున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు వెల్లడించాడు.
వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది బృందంలో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. ఈ వార్తను తనే ట్విట్టర్ వేదికగా వెల్లడించిన శ్రీశాంత్.. తన పునరాగమనం గురించి చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.
2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతను.. ఆ ఏడాదిలోనే చివరిసారిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. గతేడాది సరైన ఆధారాలు లేనికారణంగా అతనిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది.
ఈ క్రమంలో 38 ఏళ్ల ఈ పేసర్‌కు మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. కాగా, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్పకు కేరళ స్క్వాడ్‌లో చోటు దక్కలేదు.
Feels great to be back after 9 years playing Ranji trophy for my lovely state really grateful to each and everyone of u,lots of love and respect.❤️#grateful #cricket #love #kerala #cricketer #ranjitrophy #redball #neverevergiveup #comeback #time #phoenix pic.twitter.com/huiNsFgC83
— Sreesanth (@sreesanth36) December 26, 2021