కోల్‌కతా: ప్రతిష్ఠాత్మక హీరో ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అదరగొడుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్ లో ఎస్‌డీఎఫ్‌సీ 2-0 తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్‌పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన ఎస్‌డీఎఫ్‌సీ తరఫున ఒగాన లూయిస్(17ని, 70ని) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకున్నాడు.
మ్యాచ్ మొదలైన 17వ నిమిషంలో లూయిస్..రౌండ్‌గ్లాస్ డిఫెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ గోల్ చేయడంతో శ్రీనిధి జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే దూకుడు కొనసాగిస్తూ కీలకమైన ద్వితీయార్ధంలో లూయిస్ మరో గోల్ చేయడంతో ఎస్‌డీఎఫ్‌సీ గెలుపు ఖరారైంది. పుంజుకునేందుకు రౌండ్‌గ్లాస్ టీమ్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమ తదపరి మ్యాచ్‌లో ఈనెల 10న గోకులం కేరళ జట్టుతో ఎస్‌డీఎఫ్‌సీ తలపడుతుంది.