హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 4వ సీజన్ రసవత్తరంగా మొదలైంది. తొలి రౌండ్ పోటీలలో గోల్డెన్ ఈగల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శిం చింది. ఆ జట్టు గోల్ఫర్లు రాణించడంతో మొదటి రౌండ్ పోటీల్లో ఈగల్స్ 253 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈగల్స్ ఆటగాళ్లు మిథున్ రెడ్డి, శశిధర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తలా 36 పాయింట్లు స్కోరు చేశారు. డాసోస్ 252 పాయింట్లతో రెండో స్థానాన నిలవగా ఆటమ్ చార్జర్స్ మూడో స్థానంలో ఉంది.