మహ్మదాబాద్, జనవరి 31: జాతీయ స్థాయి సీనియర్ మహిళల షూటింగ్బాల్ టోర్నీకి మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన గొల్ల బండారి శ్రీజ ఎంపికైంది. జనవరి 17, 18 తేదీలలో వికారాబాద్ జిల్లా తాండూర్లో జరిగిన రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు యువతి తండ్రి రాజు తెలిపాడు. ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.