IPL 2025 : సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తడబడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన విరాట్ కోహ్లీ(22).. బౌండరీ లైన్ వద్ద మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దాంతో, బెంగళూరు 74కే మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రజత్ పటిదార్(14), లివింగ్‌స్టోన్(4)లు ఆడుతున్నారు. 9 ఓవర్లకు బెంగళూరు స్కోర్.. 89-3.
టాస్ ఓడిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) బౌండరీలతో హడలెత్తించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రెచ్చిపోయిన అతడు తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత 4, 4, 6, 4 బాది 30 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అక్షర్ బౌలింగ్‌లో విరాట్ సిక్సర్ బాది స్కోర్ 60 దాటించాడు.
Phil Salt went BOOM on Starc! 🔥
A massive 30-run over for #RCB before #DC make a comeback with 2 wickets!
Updates ▶ https://t.co/h5Vb7sp2Z6#TATAIPL | #RCBvDC | @RCBTweets pic.twitter.com/rag6B5I9u4
— IndianPremierLeague (@IPL) April 10, 2025
అయితే.. ఆ తర్వాత బంతికే సింగిల్ తీసే క్రమంలో సాల్ట్ కోహ్లీ నిరాకరించాడు. అభిషేక్ పొరెల్ విసిరిన బంతి అందుకున్న రాహుల్ వికెట్లను గిరాటేశాడు. దాంతో,61 వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(1) ఔటయ్యాడు.