హైదరాబాద్, ఆట ప్రతినిధి: నోబుల్ ప్రపంచ రికార్డు పుస్తకంలో ఐదేండ్ల బుడతడు ధ్రువస్ కొల్లా చోటు దక్కించుకున్నాడు. చదరంగంలో ఒకేసారి 19 మంది ఆటగాళ్లను చిత్తు చేసి అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఈ రికార్డు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. త్రీ చెక్, చెస్ గేమ్‌లో 20 మందితో ఒకేసారి తలపడిన మాస్టర్ ధ్రువస్.. 19 మందిపై విజయం సాధించి నిర్వాహకులను అబ్బురపరిచాడు. ధ్రువస్ అసమాన ప్రతిభను మెచ్చుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతడికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రామ్మోహన్రావు, స్వాతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.