న్యూఢిల్లీ: ఆట కన్నా ఎవరూ గొప్ప కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. భారత క్రికెట్లో కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వదంతులపై బుధవారం మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, మంత్రి అనురాగ్ స్పందించారు. ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్‌ను ప్రారంభించిన సందర్భంగా అనురాగ్ స్పందిస్తూ ‘క్రీడల కన్నా ఎవరూ గొప్ప కాదు. ఏ ఆటలో.. ఏ క్రీడాకారుల మధ్య ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు. అది సంబంధిత సంఘాలు చేయాల్సిన పని. వారు సమాచారం అందిస్తే బాగుంటుంది’ అని చెప్పారు.