Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) అర్రిట్రేషన్ కోర్టు తీర్పుపై భారీ ఆశలు పెట్టుకుంది. రజతం కోసం అప్పీల్ చేసిన వినేశ్ కేసు తీర్పును సీఏఎస్ ఆగస్టు 13కు వాయిదా వేయడంతో ఏమవుతుందోనని అందరిలో ఉత్కంఠ. ఈ సమయంలోనే ఆదివారం విశ్వ క్రీడల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.
జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం నెగ్గిన అమెరికా అమ్మాయి జోర్డన్ చిలెస్ (Jordan Chiles)కి ఆదివారం అర్బిట్రేషన్ కోర్టు షాకిచ్చింది. ఆమె గెలుపొందిన పతకాన్ని వెనక్కి ఇచ్చేయాలని తీర్పును వెలువరించింది. దాంతో, వినేశ్‌కు సిల్వర్ మెడల్ రావడంపై సందేహాలు మొదలయ్యాయి.
ఏం జరిగిందంటే..? మహిళల జిమ్నాస్ట్ పోటీల్లో జొర్డాన్ కాంస్యం దక్కించుకుంది. మొదట అంతర్జాతీయ జమ్నాస్ట్ సమాఖ్య జోర్డాన్ స్కోర్‌ను సవరించింది. ఐదో స్థానంలో ఉన్న ఆమెను మూడో స్థానంలోకి తీసుకొచ్చి కాంస్యం కట్టబెట్టింది. అయితే.. ఈ నిర్ణయాన్ని రొయేనియా జట్టు అర్బిట్రేషన్ కోర్టులో సవాల్ చేసింది. అప్పీల్ చేసేందుకు ఆఖరి నిమిషం ఉందనగా అమెరికా జట్టు నాలుగు సెకన్లు ఆలస్యంగా పిటిషన్ వేసిందని కోర్టుకు విన్నవించింది.
🇺🇸⚔️🇷🇴🥉 During the Female Gymnastics competition at the Olympics something strange happened, Romanian gymnast Ana Barbosu who achieved a bronze medal was relegated to 4th place before the podium ceremony, placing instead USA’s Jordan Chiles to the third place.
The questionable… pic.twitter.com/PXGikwOj6i
— dana (@dana916) August 7, 2024
దాంతో, రొమేనియా జట్టు వాదనను పరిగణనలోకి తీసుకున్న సీఏఎస్ అమెరికా జిమ్నాస్ట్ జోర్డాన్‌కు షాకిస్తూ.. కాంస్య పతకాన్ని వాపస్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. సాంకేతిక కారణాలను చూపిన రొమేనియాతో ఏకీభవించిన కోర్టు ఆ దేశ జిమ్నాస్ట్‌ను కాంస్యానికి అర్హురాలిగా ప్రకటించింది. సీఏఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వినేశ్ ఫోగట్ పాలిట శాపం కానుందా? ఆమె పతకంపై పెట్టుకున్న ఆశల్ని దెబ్బతీస్తుందా? అని భారతీయుల్లో ఆందోళన మొదలైంది.