జమ్ము ఎక్స్‌ప్రెస్
ప్రతిభకు సరైన దిశానిర్దేశం తోడైతే అద్భుతాలు చేయొచ్చని.. ఉమ్రాన్ మాలిక్ నిరూపిస్తున్నాడు. జమ్ములోని నవాబాద్కు చెందిన ఈ 22 ఏండ్ల కుర్రాడు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని తన వేగంతో ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు.
2017-18 రంజీ సీజన్లో అస్సాం జట్టు మ్యాచ్ ఆడేందుకు జమ్ముకు వచ్చింది. ప్రాక్టీస్ సమయంలో నెట్ బౌలర్స్ అందుబాటులో లేకపోవడంతో అస్సాం కోచ్ అజయ్ రాత్రా.. మైదానంలో ఉన్న ఓ పదిహేండేండ్ల కుర్రాడిని కాసేపు మా వాళ్లకు బంతులు విసురుతావా అని అడిగాడు! అందుకు ఒప్పుకున్న ఆ కుర్రాడు బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. పది నిమిషాల తర్వాత అతడి వద్దకు వచ్చిన అజయ్ రాత్రా.. ఇక చాలు బాబు ఆపు.. నీ వేగంతో మా వాళ్లకు గాయాలవుతున్నాయి.. అసలే రేపు మ్యాచ్ ఆడాల్సి ఉంది అని చెప్పి.. అతడిని బౌలింగ్ నుంచి తప్పించాడు!!
ఒక సారి జమ్ములో అండర్-19 లెవల్ మ్యాచ్ జరుగుతున్నది. సాధారణంగా వికెట్లకు పది గజాల దూరంలో నిల్చునే వికెట్ కీపర్ 35 గజాల అవతల నిలబడటం గమనించిన కోచ్ ఇదేంటని కీపర్‌ను ప్రశ్నించాడు. అప్పుడు వికెట్ కీపర్ ఇచ్చిన సమాధానం ఆ కోచ్‌ను ఆశ్చర్య పరిచింది. ‘సార్ వికెట్ల దగ్గర నిలబడితే.. అసలు బాల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపించడం లేదు. దాన్ని అందుకోవాలంటే ఈ మాత్రం దూరం ఉండాల్సిందే’ అని బదులిచ్చాడు. పై రెండు సందర్భాల్లో బౌలింగ్ చేసిన ఆ కుర్రాడు మరెవరో కాదు.. తాజా ఐపీఎల్ సీజన్లో మెరుపు వేగంతో ప్రత్యర్థులను అల్లాడిస్తున్న ఉమ్రాన్ మాలికే!! టీమ్ఇండియా వైపు వడి వడిగా అడుగులు వేస్తున్న ఈ జమ్ము ఎక్స్‌ప్రెస్‌పై ప్రత్యేక కథనం..
–నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ప్రతిభకు సరైన దిశానిర్దేశం తోడైతే అద్భుతాలు చేయొచ్చని.. ఉమ్రాన్ మాలిక్ నిరూపిస్తున్నాడు. జమ్ములోని నవాబాద్కు చెందిన ఈ 22 ఏండ్ల కుర్రాడు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని తన వేగంతో ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. బుధవారం గుజరాత్, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పర్ఫెక్ట్ యార్కర్‌తో వృద్ధిమాన్ సాహా వికెట్ పడగొట్టిన ఉమ్రాన్.. మెరుపు వేగంతో శుభ్‌మన్ గిల్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఈ రెండు బంతులూ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసినవే కావడం విశేషం. ఈ పోరులో సన్‌రైజర్స్ ఓటమి పాలైనా.. చర్చంతా ఉమ్రాన్ బౌలింగ్‌పైనే సాగింది. భువనేశ్వర్, నటరాజన్, జాన్సెన్‌తో కూడిన బౌలింగ్ లైనప్ ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన చోట ఉమ్రాన్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఇలాంటి సహజసిద్ధమైన వేగం ఉన్న ఉమ్రాన్ త్వరలోనే టీమ్ఇండియాకు ఆడటం ఖాయమే అని న్యూజిలాండ్ మాజీ కోచ్ డానియల్ వెటోరీ అన్నాడు.
బూట్లు కూడా లేకుండా..
జమ్ములోని మౌలానా ఆజాద్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్ ఇస్తున్న రణ్‌ధీర్ సింగ్ మన్హాస్ వద్దకు వచ్చిన ఓ పదిహేడేండ్ల కుర్రాడు ‘సార్ మీరు నన్ను బౌలింగ్ చేయనిస్తారా’ అని అడిగాడు. కనీసం బూట్లు కూడా లేని ఆ కుర్రాడిని గమనించిన మన్హాస్ బంతి చేతికిచ్చి బౌలింగ్ చేయమన్నాడు. అప్పటి వరకు ఎలాంటి కోచింగ్ తీసుకోకున్నా.. ఉమ్రాన్ తన వేగంతో మన్హాస్‌ను ఆకర్శించాడు. అంత వరకు అల్లరి చిల్లరిగా తిరిగిన ఉమ్రాన్‌కు.. ఆ సమయంలో మన్హాస్ దిశానిర్దేశం చేశాడు. అక్కడి నుంచి క్రమశిక్షణ అలవర్చుకున్న ఉమ్రాన్.. ఆ తర్వాత చూస్తుండగానే అండర్-19, రంజీ జట్లలో చోటు దక్కించుకున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉమ్రాన్ బౌలింగ్ వీడియోలు తీయించిన అతడి స్నేహితుడు అబ్దుల్ సమద్.. వాటిని అప్పటి సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పంపాడు. ఉమ్రాన్ బౌలింగ్ తీరుకు మంత్రముగ్ధుడైన లక్ష్మణ్ యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్ కోసం అతడిని నెట్ బౌలర్‌గా ఎంపిక చేశాడు. గత సీజన్లో నటరాజన్ గాయపడటంతో అతడి స్థానంలో హైదరాబాద్‌లో చోటు దక్కించుకున్న ఉమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఇక ఈ ఏడాది వేలానికి వదిలేయకుండా అట్టిపెట్టుకోవడంతో మరింత బాధ్యతాయుతంగా ఆడుతున్న ఉమ్రాన్.. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు.
ఉమ్రాన్ ముందు తేలిపోతున్నాం!
బుల్లెట్ వేగంతో బంతులేస్తున్న ఉమ్రాన్‌పై సొంత జట్టు ఆటగాళ్లే పలు ఆరోపణలు చేస్తున్నారు. ‘ఉమ్రాన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థి బ్యాటర్లు నా బౌలింగ్‌లో పరుగులు ఎక్కువ రాబడుతున్నారు. అతడితో పోల్చుకుంటే నా బౌలింగ్ కాస్త నెమ్మదిగా ఉండటంతో వారు నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని ఇటీవల సన్‌రైజర్స్ పేస్ హెడ్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ఇది కోపంతో చేసిన కామెంట్ అనుకుంటే పొరబాటే! 22 ఏండ్ల కుర్రాడు నిలకడైన వేగం కొనసాగిస్తుంటే అతడిని భువీ తన మాటలతో ఇలా అభినందించాడు! పర్వత ప్రాంతంలో పెరిగి పెద్దవ్వడంతో అతడి అప్పర్ బాడీతో సమానంగా లోయర్ బాడీ బలంగా ఉండటంతోనే ఇంత వేగం సాధ్యమౌతున్నదని దిగ్గజ పేసర్ ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. అతడిని జాగ్రత్తగా కాపాడుకుంటే.. రానున్న కాలంలో టీమ్ఇండియాకు ప్రధాన పేసర్‌గా సేవలందించడం ఖాయమే అని మాజీలు అంటున్నారు.
తుది జట్టులో చోటు దక్కకపోయినా అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలి. మహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్, ఉమేశ్ అందుబాటులో ఉండటంతో అతడు ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడకపోయినా.. జట్టుతో కలిసి ప్రయాణిస్తే మరింత రాటుదేలుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
– సునీల్ గవాస్కర్
ఉమ్రాన్ తన వేగంతో టెయిలెండర్లనే కాక.. ప్రధాన బ్యాటర్లను కూడా బెంబేలెత్తిస్తున్నాడు. అతడిది అసాధారణమైన వేగం. 153-154 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. బ్రెట్ లీ, షోయబ్ అక్తర్, షాన్ టైట్ తర్వాత నిలకడగా ఈ వేగాన్ని కొనసాగించిన వాళ్లే లేరు. ఉమ్రాన్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో అతడు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే. ఉమ్రాన్‌లో ఆ సత్తా ఉంది.
బీసీసీఐ, ఎన్సీఏ అతడిపై పని భారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
– వెటోరీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

