Deodhar Trophy | పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 9 వికెట్ల తేడాతో నార్త్ఈస్ట్ జోన్‌పై ఘన విజయం సాధించింది. నార్త్ఈస్ట్ జోన్ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని సౌత్‌జోన్ వికెట్ కోల్పోయి 19.3 ఓవర్లలో విజయాన్నందుకుంది.అంతకముందు సాయికిషోర్ (3/22), విద్వత్ కావేరప్ప (3/27) ధాటికి నార్త్ఈస్ట్ జోన్ 136 పరుగులకు కుప్పకూలింది.