సౌత్‌జోన్‌దే దులీప్ ట్రోఫీ
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ విజేతగా నిలిచింది. వెస్ట్‌జోన్‌తో జరిగిన తుదిపోరులో సౌత్‌జోన్ 75 పరుగుల తేడతో గెలుపొందింది.
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ విజేతగా నిలిచింది. వెస్ట్‌జోన్‌తో జరిగిన తుదిపోరులో సౌత్‌జోన్ 75 పరుగుల తేడతో గెలుపొందింది. 298 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 182/5తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ చివరకు 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ప్రియాంక్ (95) ఒంటిరి పోరాటం వృథా అయింది. సౌత్ జోన్ బౌలర్లలో సాయి కిషోర్, కౌషిక్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ 213 పరుగులు చేయగా.. వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులు చేసి ప్రత్యర్థికి 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌత్‌జోన్ పేసర్ విద్వత్ కవెరప్పకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

