బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నుంచి మొదలైన సెమీస్ పోరులో తొలిరోజు సౌత్‌జోన్ బౌలర్లు చెలరేగారు. కర్ణాటక పేసర్ విద్వత్ కావేరప్ప (4/66) నాలుగు వికెట్లు పడగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్.. 195 పరుగులకే కుప్పకూలింది. కావేరప్పతో పాటు కేరళ బౌలర్ నిధీశ్ (2/36), స్పిన్నర్ త్యాగరాజన్ (2/31) రాణించడంతో నార్త్ కోలుకలేకపోయింది. ఆ జట్టు బ్యాటర్లలో కమ్రాన్ ఇక్బాల్ (76) ఒక్కడే మెరుగ్గా ఆడాడు.
అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన సౌత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 40 రన్స్ చేసింది. జగదీశన్ (34 బ్యాటింగ్), కెప్టెన్ తిలక్ వర్మ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సెంట్రల్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో.. ఈస్ట్ బౌలర్లు రాణించడంతో రజత్ పటీదార్ సారథ్యంలోని సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌లో 266 రన్స్‌కు ఆలౌట్ అయిం ది. రింకూ సింగ్ (60), ఆర్యన్ జుయల్ (46) ఆ జట్టును ఆదుకున్నారు. ఈస్ట్ బౌలర్లలో అభిజిత్ (3/38), ముకేశ్ (3/56), మహ్మద్ షమీ (2/42) మెరిశారు.