డర్బన్: సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) .. తన పవర్ గేమ్‌తో అలరించే విషయం తెలిసిందే. భారీ షాట్లతో ఆకట్టుకునే ఆ హిట్టర్.. టీ20 క్రికెట్లో ఓ మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఒకే ఏడాదిలో వంద సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా ఘనతను సాధించాడు. ఈ ఏడాది క్లాసెన్ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు బాదేశాడు. డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ మైలురాయి చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతుల్లో అతను 25 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఓ సిక్సర్ ఉన్నది.
ఒకే ఏడాదిలో వంద సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో క్లాసెన్ నాలుగో వ్యక్తి. మిగితా ముగ్గురూ విండీస్ ప్లేయర్లే ఆ లిస్టులో ఉన్నారు. విండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ 2011, 2012, 2013, 2015, 2016, 2017 లో వందేసి సిక్సర్లు కొట్టాడు. ఆ దేశానికి చెందిన నికోలస్ పూరన్ 2024లో వంద సిక్సర్లు బాదాడు. ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ 2019లో ఆ రికార్డు అందుకున్నాడు.