Lizelle Lee : మహిళల ప్రీమియర్ లీగ్‌లో దూకుడైన ఆటతో అభిమానులను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ లిజెల్లె లీ (Lizelle Lee) అలరిస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే తన విధ్వంసక ఆటతో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న లీ.. డబ్ల్యూపీఎల్‌లోనూ రఫ్పాడిస్తోంది. ఇప్పటికే రెండు అర్ధ శతకాలతో విరుచుకుపడి ఫ్రాంచైజీపై తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. భారీ కాయం ఉన్నప్పటికీ.. చకచకా వికెట్ల మధ్య పరుగెడుతూ.. వికెట్ల వెనకాల మెరికలా కదులుతున్న తనలో ప్రతిభకు కొదవలేదు. కానీ, అధిక బరువు కారణంగా అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదింటా రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. షఫాలీ వర్మలాంటి డేరింగ్ బ్యాటర్‌కు లీజెల్లీ లీ జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించడం అగ్నికి వాయవు తోడైనట్టుగా మారింది. తన మార్క్ విధ్వంసంతో ఈ లీగ్‌లో రెండు అర్ధ శతకాలు బాదేసిందామె. ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఆడడం చూసి ఫ్యాన్స్ వారెవా అంటున్నారు.
Powerplay-ನಲ್ಲಿ Lizelle Lee ಅಬ್ಬರಿಸುತ್ತಿದ್ದಾರೆ.🥵
📺 ವೀಕ್ಷಿಸಿ | TATA WPL | #DCvMI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.
#TATAWPL pic.twitter.com/pbL8T7NKpA
— Star Sports Kannada (@StarSportsKan) January 20, 2026
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 పరుగులతో నిరాశపరిచిన లీ.. ఆపై గుజరాత్ జెయింట్స్‌పై చెలరేగింది. కేవలం 54 బంతుల్లోనే 12 ఫోర్, 3 సిక్సర్లతో 86 రన్స్ కొట్టింది. యూవీ వారియర్స్ బౌలర్లను బాదేస్తూ 67 (44 బంతుల్లోనే 8 ఫోర్, 3 సిక్సర్లతో) రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆర్సీబీపై 4 రన్స్‌తో నిరాశపరిచినా.. వడోదరలో ముంబైపై 46 పరుగులతో రాణించింది లీ.
క్రీడల్లో ముఖ్యంగా.. క్రికెట్ వంటి పరుగులు తీయాల్సిన ఆటలో ఫిట్నెస్ చాలా ముఖ్యం. అమోఘమైన నైపుణ్యమున్నా లావెక్కువ ఉండడం లిజెల్లీ లీ పాలిట శాపంగా మారింది. అధిక బరువుతో ఆమె ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూనే ఆటను కొనసాగించింది. కానీ, ఆమెకు దక్షిణాఫ్రికా క్రికెట్ నుంచి మద్దతు లభించలేదు. దాంతో.. అంతర్జాతీయ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగింసింది. ఎంతో ఇష్టమైన ఆటకు మనసుకు కష్టమైనా 2022 జూలైలో వీడ్కోలు పలికింది. ఆ ఏడాది ఆమె ‘ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమైన బాధలో ఉన్న ఆమెకు కొండంత ఊరటనిస్తూ.. ఫ్రాంచైజీ క్రికెట్ స్వాగతం పలికింది.
Look how happy she is 😄
Lizelle Lee has her first half-century in a WBBL finals match! #WBBL11 pic.twitter.com/fKyaxM8gDN
— Weber Women’s Big Bash League (@WBBL) December 13, 2025
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హొబర్ట్ హరికేన్స్ (Hobart Hurricanes) ఓపెనర్‌గా లిజెల్లె చరిత్రను తిరగరాసింది. పెర్త్ స్కాచర్స్ బౌలర్లకు దడ పుట్టిస్తూ లిజెల్లె రికార్డు స్కోర్ కొట్టింది. 150 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ గ్రేస్ హ్యారిస్ (Grace Hariis) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. లిజెల్లే విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో హొబర్ట్ జట్టు 75 పరుగుల తేడాతో గెలుపొందింది.
1. లిజెల్లె లీ – 150 నాటౌట్
2. గ్రేస్ హ్యారిస్ – 136 నాటౌట్
3. స్మృతి మంధాన – 114 నాటౌట్
4. అషే గార్డ్నర్ – 114
5. అలీసా హేలీ – 112 నాటౌట్
మహిళల టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల మహరాణిగా లిజెల్లె మరో రికార్డు తన పేరిట రాసుకుంది. పెర్త్ స్కాచర్స్పై 12 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఆమె గ్రేస్ హ్యారిస్‌ను రెండో స్థానానికి నెట్టేసింది. ఇక లారా అగత కూడా 11 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ బ్యాటర్ అషే గార్డ్నర్ 10, వెస్టిండీస్ హిట్టర్ డియాండ్ర డాటిన్ 9 సిక్సర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.