సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 17, 2021 , 15:51:22

14 ఏండ్ల తర్వాత పాక్‌ పర్యటనకు వచ్చిన సఫారీలు

14 ఏండ్ల తర్వాత పాక్‌ పర్యటనకు వచ్చిన సఫారీలు

ఇస్లామాబాద్‌:   దాదాపు 14ఏండ్ల సుదీర్ఘ విరామం  తర్వాత  క్రికెట్‌ సిరీస్‌ కోసం   సౌతాఫ్రికా జట్టు పాకిస్థాన్‌ గడ్డపై  అడుగుపెట్టింది.   చరిత్రాత్మక పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు  శనివారం కరాచీ చేరుకున్నది. సఫారీ ఆటగాళ్లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.      వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో ఇరుజట్లు రెండు టెస్టులు,  మూడు టీ20ల్లో తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా చివరిసారిగా 2007లో పాకిస్తాన్‌లో పర్యటించింది.

2009లో  పాక్‌లో  శ్రీలంక క్రికెటర్లు ఉన్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.   ఉగ్రదాడి కారణంగా ఆ దేశంలో పర్యటించేందుకు  ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో  స్వదేశంలో  ఆడాల్సిన సిరీస్‌లను తటస్థ వేదికైన   యూఏఈలో పాక్‌ ఆడుతూ వస్తున్నది.  ఎలాగైన తమ దేశంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరించాలని పట్టుదలతో ఉన్న  పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అగ్రశ్రేణి జట్లను తమ దేశ పర్యటనకు ఆహ్వానిస్తోంది. 

VIDEOS

logo