PAKW vs SAW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విజయాలతో సెమీస్ చేరిన ఆ జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయాల నడుమ సాగిన పోరులో.. పాక్‌పై 150 పరుగుల తేడాతో గెలుపొందింది సఫారీ టీమ్. మొదట కెప్టెన్ లారా వొల్వార్డ్త్(90), సునే లుస్(61), మరినే కాప్ (68 నాటౌట్)ల విధ్వంసంతో 312 రన్స్ కొట్టిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత మరినే (3-20) విజృంభణతో పాకిస్థాన్‌ను వణికించింది. వర్షం పదే పదే అడ్డుపడగా.. 20 ఓవర్లలో లక్ష్యాన్ని 234గా సవరించారు. కానీ, పాక్ 83 రన్స్‌కే పరితమైంది.
వరల్డ్ కప్‌ను ఓటమితో ఆరంభించిన దక్షిణాఫ్రికా .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. బలమైన జట్లకు షాకిస్తూ సెమీస్ చేరిన సఫారీ జట్టు.. ఈసారి ఆల్‌రౌండ్ షోతో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసంతో డీలా పడిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మునీబా అలీ(5)ని పేసర్ ఖాకా ఔట్ చేసి తొలి బ్రేకిచ్చింది. ఆరంభంలోనే వికెట్ పడడంతో సిద్రా అమిన్ (13), ఒమైమా సోహైల్ (6) జాగ్రత్తగా ఆడారు. కాస్త కుదురుకున్నాక సిద్రా ఫోర్లతో అలరించింది. అయితే.. 7వ ఓవర్లో మరినే కాప్ రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టింది. మొదటగా సొహైల్‌ను ఎల్బీగా ఔట్‌చేసిన తను.. చివరి బంతిని సిద్రాను డగౌట్ చేర్చింది.
South Africa go top with their fifth consecutive win, Pakistan are down and out after another rainy affair in Colombo
Scorecard: https://t.co/kiBHEBurHO pic.twitter.com/n4mtpG5IEf
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2025
మరోసారి తన ప్రతాపం చూపిస్తూ అలియా రియాజ్(3)ను ఔట్ చేసిన కాప్ పాక్‌ను కష్టాల్లోకి నెట్టింది. నాలుగు వికెట్లు పడిన పాక్ జట్టు ఇక కోలుకోవడం కష్టమే అనుకున్నవేళ.. వర్షం మొదలైంది. దాంతో, లక్ష్యాన్ని 299కి కుదించారు. కానీ, వాన మరో రెండు సార్లు అంతరాయం కలిగించగా.. 20 ఓవర్లలో 234గా సవరించారు. కానీ, పాక్ 83 రన్స్‌కే పరిమితమై భారీ ఓటమి మూటగట్టుకుంది.
వరల్డ్ కప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయం తర్వాత సఫారీ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. లారా వొల్వార్డ్త్(90) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరినే కాప్(68 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలో రెచ్చిపోయారు. ఆఖర్లో డీక్లెర్క్(41) సిక్సర్ల మోతతో జట్టు స్కోర్ మూడొందలు దాటించింది. వీరందరి వీరబాదుడుతో 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 312 రన్స్ కొట్టింది.