బెనొని : మరికొద్దిరోజుల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. నాలుగో మ్యాచ్‌లో గెలిచినా ఇరుజట్ల మధ్య సోమవారం జరిగిన ఐదో టీ20లో 23 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత దక్షిణాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 92 నాటౌట్, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటంతో 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 155 రన్స్ చేసింది.
భారత బౌలర్లలో రేణుకా (2/21), శ్రీ చరణి (2/22), దీప్తి (2/37) తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప ఛేదనే అయినప్పటికీ ఉమెన్ ఇన్ బ్లూ.. నిర్ణీత ఓవర్లలో 132/8 వద్దే ఆగిపోయింది. ఫల్మలి (40), రిచా ఘోష్ (25 నాటౌట్) పోరాటం సరిపోలేదు. ఈ గెలుపుతో సిరీస్‌ను దక్షిణాఫ్రికా 4-1తో గెలుచుకుంది. సిరీస్‌లో 330 పరుగులు చేసిన వోల్వార్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులూ దక్కాయి.